Episode 69

ఆశ - ఆశంక : డాక్టర్ సౌవేంద్ర హన్సడా రచన ( ఆంగ్ల మూలం)

’ఆశ – ఆశంక’ అనే ఈ కథ డాక్టర్ సౌవేంద్ర శేఖర్ హన్సడా గారు రాసిన ఆంగ్ల కథా సంపుటం ‘The Adivasi will not dance’ నించి స్వీకరించబడిన ‘Desire, Devination, Death’ అనే కథకు తెలుగు అనువాదం . ( కథ ఆంగ్ల మూలం – https://ur.booksc.eu/dl/28680189/d870eb)

ఈ పుస్తకం ‘ Speaking Tiger Publications’ ద్వారా ప్రచురింపబడింది. 2015 సంవత్సరానికి ఈయన కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం గెలుచుకున్నారు. వృత్తిరీత్యా ప్రభుత్వ వైద్యులు. 

ఈ కథను శ్రావ్యంగా, భావ స్ఫోరకంగా హర్షణీయం కు చదివించిన స్వాతి గారికి కృతఙ్ఞతలు. 

https://bit.ly/Swatipantula

స్వాతి గారి యుట్యూబ్ ఛానెల్ లో మరెన్నో తెలుగు కథలు మీరు వినవచ్చు. 

ఆశ – ఆశంక :

వడి వడిగా నడుస్తోంది సుభాషిణి. ఆ మట్టి  రోడ్డు మీద నడుస్తున్న వాళ్లందరినీ గబా గబా దాటుకొని వెళ్తోంది. సాయంకాలం నీరెండలో,  ధూళి ఆమె పాదాల నుంచి ఓ చిన్న తెరలా పైకి లేవటం కనపడుతోంది. ఆమె మొహంలోకి  పరికించి చూస్తే తన పెదాలు బిగబట్టి మనసులోని అల్లకల్లోల్లాన్ని తొక్కిపెడుతోందా అనిపిస్తోంది.  ‘ఛకూలియా’ శనివారం సంత రద్దీ నించీ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది తాను.  ఇంటికి చేరుకోడానికి ఇంకా ఐదు కిలోమీటర్ల పైన నడవాలి. 

‘రోషపల్’ లో ఉంటుంది సుభాషిణి.

మామూలు రోజుల్లో అయితే, సుభాషిణి ఛకూలియాలో ఆగి, కమరిగూడ తోటల్లో అపుడే  కోసిన  ఆలుగడ్డలు,  ఎర్రటి టమాటోలతో పాటూ ఒక మంచి ఆకు కూర కొంటుంది. అక్కణ్ణించీ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి  బెస్త ముసిలిదాని గుడిసె ముందుకెళ్లి నిలబడి,  ఖరీదైన ‘రూయి’ , ‘కాట్లా’ చేపలు  తాజాగా లేవు అని నసుగుతూ, కొనేసేటట్టు బాగా బేరం చేసి చేసి ,  చవగ్గా దొరికే  ‘బాష్ పాటాలు’  మాత్రం కొనుక్కుని  వాటితో ఎండబెట్టి,  కమ్మటి పులుసు చేసుకుందాం  అని ఊహించుకుంటూ,  చివరికి   ‘మా మోనోసా’  స్వీట్ల షాపు  దగ్గర ఆగి, తన పద్నాలుగేళ్ల పరూల్ కీ, పదకొండేళ్ల నిలుమోనీకీ , ఏడేళ్ల చంటోడు కూనా రామ్ కీ,  ఓ అర డజను జోబె లడ్డూలు, సమోసాలు కొనుక్కుని,  అపుడు  కానీ ఇంటివైపు నడక మొదలు పెట్టదు. 

నాలుగు జిలేబీలు మాత్రం, కాయితపు పొట్లంలో  దాచుకుని, ఆ పొట్లాన్ని  గుండెలకదుముకొని నడుస్తోంది సుభాషిణి.  ఒళ్ళు, కళ్ళు రోడ్డు మీదున్నట్టున్నా, తన ఆలోచనలు  ఇంకెక్కడో తిరుగుతున్నాయి. తొందరగా పని ముగించుకు బయటపడదాం! అనుకున్నా కుదరలేదీరోజు. 

అందరినీ పలకరిస్తూ నిదానంగా   నడిచే అలవాటున్న సుభాషిణి, పొద్దు పొడిచే ముందే ఇల్లు చేరడం అనేది చాలా అరుదు. మామూలు రోజుల్లో అయితే, సాయంకాలం పూట, సుభాషిణి  తాను పనిచేసే  రైస్ మిల్లు , ఇంకా అల్యూమినియం ఫ్యాక్టరీ , సోపు ఫ్యాక్టరీ , బద్రీనాథ్ సేటు తోట , దేవ్ బాబు కోళ్ల ఫారం, ఇంకా చుట్టుపక్కల   కంస్ట్రక్షన్ సైట్లలో పని చేసే  స్నేహితురాళ్ళ తో పాటూ కబుర్లు చెప్తూ ఊరి వైపు నడుస్తుంది. నేతచీరలు కట్టుకొని కొంతమంది, సిలుకు చీరలు కట్టుకొని ఇంకొంతమంది, పెద్దా చిన్నా ఆడవాళ్ళందరూ కలిసి, సీవెండి కారియర్లు మోసుకొని,  తలగుడ్డలు  నడుముకు చుట్టుకొనో, భుజానికి తగిలించుకునో, నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలతో ఇంటికి నడిచే సమయం అది. ప్రైవేటు జీపుల, ఝార్ఖండ్ గవర్నమెంటు బస్సుల హారన్లతో, వాటిలో వుండే  క్లీనర్లు తప్పుకోమంటూ  పెట్టే కేకలతో మారుమోగుతూ ఉంటుంది ఆ రోడ్డు. అలిసిపోతేనో ఆలస్యమైపోతేనో తప్ప, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళల్లో   వీటిని ఆపి ఎక్కేవాళ్ళెవరూ ఉండరు,. ఎక్కారంటే మటుకు, ఇవ్వాల్సిన డబ్బుల  గురించి సగానికి సగం బేరాలు మొదలు పెడతారు. ప్రతి పైసా మీదా హోరా హోరీ పోరాటంతో పాటూ శాపనార్థాలూ తిట్లూ అదనం. వాటినన్నిటినీ విని  ఆనందిస్తూ ఇంకా ఇంకా ఉసికొల్పుతూ వుంటారు డ్రైవర్లు క్లీనర్లూ.  లోపలున్న, చిన్నా పెద్దా అందరికీ  ఇదో మంచి కాలక్షేపం.   తన బొడ్డు సంచీలో వుండే చిల్లరను సాధ్యమైనంతవరకు కాపాడుకుంటూ,  బండెక్కి ప్రయాణించే సౌకర్యాన్ని  కూడా  వినియోగించుకుంటూ, ఇలాంటి  ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న సుభాషిణికి,  నిజానికి  నడకంటేనే ఇష్టం. నడుస్తూ అయితే  డుమినీతో కాస్సేపు  మాట్లాడుకోవచ్చు. డుమిని సుభాషిణికి మంచి స్నేహితురాలు. పక్కూరు  బలిపూర్లోనే ఉంటుంది.  ఒకే చోట పనిచేస్తున్నా, ఇంటికి నడిచేటప్పుడే వాళ్ళిద్దరికీ మాట్లాడానికి సమయం దొరికేది. 

ముదురు ఎరుపులోకి మారుతున్న ఆకాశాన్ని  ప్రతిఫలిస్తోందా అన్నట్టు మట్టి రోడ్డు  లేత నారింజ రంగులో మెరుస్తోంది. పని ముగించుకుని ఇంటికి వెళ్లే ఆడవాళ్ల కబుర్లతో, గూళ్ళల్లో ఆశగా ఎదురుచూస్తున్న పిల్లల కోసం, ఆహారం  నోట  పెట్టుకుని వేగంగా  ఎగురుతూ వెళ్లే పక్షుల శబ్దాలతో కోలాహలంగా వుంది వాతావరణం. 

సుభాషిణి నడకలో వేగం బాగా హెచ్చింది.  ఒంటరిగా నడుస్తోంది. 

 “ముందర నువ్వు బయలుదేరు” అని తొందర పెట్టారు  తన తోటి వాళ్ళు.  

 డుమిని కూడా,  “నడవొద్దు. వేరే ఏవీ ఆలోచించకుండాఅద్దె జీపులో ఇంటికెళ్ల”మని చెప్పింది.  

పక్కన ఆగున్న జీపులో ఎలాగోలా  ఎక్కుదామని ప్రయత్నించింది సుభాషిణి. జీపు అంతా  ఇంటికెళ్ళే జనాలతో నిండిపోయుంది. కాలు మోపడానికి కూడా స్థలం లేదు. పగటి వేషగాళ్ళ మాదిరి వింత వింత  డ్రెస్సులేసుకుని, విచిత్రంగా జుట్టు కత్తిరించుకుని,  మీద సామాన్లు కట్టేసే  చోట కూర్చుని,  ఇద్దరు కుర్రవాళ్ళు కిళ్ళీ నములుతూ, జీపులో స్థలం కోసం ఆదుర్దాగా తొంగి చూసే వాళ్ళ పైన వుమ్మేస్తున్నారు. బాధితులు ఎవరైనా పైకి కోపంగా చూస్తే, వెకిలిగా పళ్ళు చూపిస్తూ నవ్వుతున్నారు.  ఒక చివరన డ్రైవరు సాహసోపేతంగా  సగం శరీరం జీపులో కూర్చోబెట్టి, మిగతా సగం  గాల్లో  వేలాడేసుకునుంటే, అతడి తోటే  ఇంకో   ముగ్గురు కూచుని వున్నారు  ముందు సీట్లో. ఈ చివరన ఫుట్ బోర్డు మీద కాలు పెట్టి ఒకడు, మధ్య వున్న సందులో తన శరీరాన్ని ఎలాగోలా ఇరికించుకుని ఇంకోవాడు కనపడుతున్నారు.   డ్రైవరు పక్కనుండే మూడో వాడి కాళ్ళ మధ్యలో గేర్ వుంది.   డ్రైవరు గేర్ మార్చినప్పుడల్లా అతని పిడికిలి తనకు తగల రాని చోట తగిలే ప్రమాదం ఉందని  వాడికి తెలీకుండా ఉండదు.  

‘ఈ  బండి ఎలా నడుస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఏ ప్రమాదం జరగకుండా ఆయనే కాపాడాలి వీళ్లందరినీ ఈ రోజు.’ ఆ జీపులో కూరుకు పొయ్యి  దేవుణ్ణి తల్చుకునే కంటే , నడకే మేలనిపించింది సుభాషిణికి. 

సుభాషిణితో అన్నాడు క్లీనర్ జీపు  పైభాగాన్ని చూపిస్తూ, కన్ను గీటుతూ   “ఉపోర్ చాప్ గో మాసి”. 

సుభాషిణి ఒళ్ళు భగ్గున మండింది . 

“తూయి చాప్ , అమీ నై చాపి” అని వాణ్ణి గట్టిగా కసురుకుని, తన టిఫిన్ కారియర్ చేతికున్న గుడ్డ సంచీలో పడేసి, , జిలేబీల పొట్లం,  బంగారం దాచుకున్నట్టు,  గుండెల కదుముకుని, తల ఎగరేసి తీక్షణంగా ముందున్న రోడ్డు వైపు  చూస్తూ మళ్ళీ నడక మొదలు పెట్టింది. సుభాషిణి వాలకం చూస్తే ఏదో యుద్ధానికి  సన్నద్ధమై పోతున్నట్లుంది. భారంగా నడుస్తున్న ఎద్దు బండ్లను, రోడ్డుకు అడ్డదిడ్డంగా వచ్చే రిక్షా వాళ్ళను, సైకిల్ నడిపే వాళ్ళను తప్పించుకుంటూ అలానే  చాలా దూరం నడిచింది. 

ఇందాకటి జీపు హారన్ గట్టిగా మోగించుకుంటూ వెనకనించి వస్తోంది . 

‘సోర్ గో మాసి’ అని విసురుగా  అరిచాడు,  పక్కకు జరగమన్నట్టు  చేతులూపుతూ క్లీనర్ గాడు . 

చీరకొంగును మొహంమీద వేస్కుని, ఒక్క ఉదుటున  రోడ్డు పక్కనే వున్న గడ్డి పొదలోకి గెంతింది సుభాషిణి. 

నల్లటి పొగతో  కల్సిన ఎర్రటి దుమ్ములో ఆమెను ముంచేస్తూ  ముందుకెళ్లింది  జీపు. 

“ కీ మాసీ, మోర్తే ఖుట్చూ” అని అరిచాడు  వెడుతున్న జీపులోంచి  క్లీనర్. 

“మోర్బెక్! తేరే మా”  అంటూ అరిచింది సుభాషిణి, “ గాడియే ఛాపి ఫూటానీ కోర్చూ, జొమీనే చాల్ దేఖీ”

సుభాషిణి కేకల్ని  తన శబ్దంలో కలిపేసుకుని ముందుకెళ్ళిపోయింది,  కిక్కిరిసున్న  జీపు. మండుతున్న కళ్ళు నులుముకుంటూ, లోపల్నించీ పొంగి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ, అలానే నిలబడిపోయింది ఓ రెండు క్షణాలు సుభాషిణి.  దుమ్ములో స్నానం చేసినట్టుంది ఆమెకి. ఆమె మనసులో ఇంకో మూల ఓ చిన్న బాధ మొదలైంది.  తనకు ఏ మాత్రం తెలీని ఓ ఆడమనిషిని తిట్టేసింది. కాదు కాదు . అంతా ఆ క్లీనర్ గాడి వల్లే, ఎందుకు కనిందో ఇలాంటి వాణ్ణి వాడి తల్లి.   తన తల్లి  వయసున్న ఆడవాళ్లను అనగూడని మాటలు అంటాడా? ఎందుకూ పనికి రాని అడ్డగాడిద! వాళ్ళమ్మ కొంచెం మర్యాద నేర్పించుంటే, బావుండేది ఎదవకి. నా చంటాడు కూనారామ్ చేస్తాడా ఇలాంటి పని?  లేదు లేదు . ఎప్పటికీ చెయ్యడు. కొడుకును సరిగ్గా పెంచనందుకు , వాళ్ళమ్మను తిట్టడంలో తప్పే  లేదు.  అది సరే .. అయినా  వాళ్ళ అమ్మ ఏమి చేసింది పాపం? . కేకలు పెడ్తూ తనని  ఎగతాళి చేసింది ఆ క్లీనర్ గాడు కదా… 

సుభాషిణి మనసు పరిపరి విధాల పోతోంది. 

భగవంతుడా! నా చేత ఎలాంటి ఎలాంటి  పనులు చేయిస్తున్నావు? వాడు   ఆలా ఎందుకు  మాట్లాడాలి,  నేను నోరు పారేసుకునేట్టు ?అయినా ఇలాటివన్నీ  ఈ రోజే  ఎందుకు జరుగుతున్నాయి? నాకు సీటు దొరక్కపోవడం , వాడి చేత మాటలు పడ్డం? నేను ఇంకో బండి చూసుకొని వుండొచ్చుగా?  ఏం జరుగుతోంది నాకు? 

అప్పటిదాకా అతికష్టం మీద  ఆపుకున్న శోకం పైకి తన్నుకొస్తోంది  సుభాషిణికి.  కళ్ళు, నీళ్లతో మసకబారాయి. రెండు చుక్కలు మాత్రం  ఎలాగోలా కళ్ళని దాటుకుని, ముదురు గోధుమ రంగు  బుగ్గల మీదున్న ఆ  నల్లటి మచ్చలమీద  జారుతూ చారికల్లా మారాయి.  నల్లటి మచ్చలు! క్షణ క్షణం ఒత్తిడితో అలుపెరగకుండా పని చేస్తూ, ఇంటి భారం ఒంటరిగా ఇన్నాళ్లు  మోస్తూ వచ్చినందుకు,  కాలం ఇచ్చిన బహుమతి. 

నాకే ఎందుకు జరగాలిలా? నాకే ఎందుకు? ఇది కూడా ఓ పరీక్షా? ఎన్ని పరీక్షలు పెట్టావు? ఇంకా నా మీద దయ కలగలేదా నీకు? ఇంకెన్ని చూడాలి  నేను?  ఎంతమందిని నానుంచి తీసుకెళ్లి పోతావు? 

                                                                           —–

మా నాన్న పేరు పెడదాం  వీడికికూనారామ్అని!”,  అన్నాడు  భర్త  సూనారామ్

వంచిన తల కూడా  పైకెత్తకుండా కొట్టింది !  .  వినపడిందో లేదో అతనికి

ముందు పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్నీ నెత్తిన పెట్టుకున్నాడు. మూడోసారి కొడుకే కావాలంటాడు. తనకు కూడా కొడుకే కావాలి అని అతనికి ఎలాచెప్పాలి? నిండుగర్భం వైపు తదేకంగా  సూనారామ్  చూస్తూంటే , అతన్నే చూస్తూ వుండాలనిపించేది మాటనేదే లేకుండా. 

 “ఈసారి మటుకు  కొడుకునే కంటున్నావు. కచ్చితంగా!” 

చీరసవరించుకుందిఅతనిచూపులతోదిష్టితగులుతుందేమోనని

వాడి పేరు కూనారామ్. నాన్నపేరు. వింటున్నావారెట్టించాడు

అలానే . కూనారం అనే పెడదాం వాడికిచెప్పాలనుకుంది తను. కానీ, ఏమీ చెప్పకుండా, ఆ చూపుల నుంచి అతికష్టం మీద తప్పించుకుంటూ అక్కడనించీ కదిలింది  సుభాషిణి

సూనారాం ఆనందానికి హద్దు లేకుండా వుంది. ‘నాన్న వెనక్కు వస్తున్నాడు, పసిబిడ్డగా. తన బిడ్డగా…’  

 అతని అంతులేని ఆనందానికి తనేకారణం అవుతున్నానని సుభాషిణి కూడా  చాలా సంతోషంగా వుంది, “కొడుకునే ఇవ్వు భగవంతుడా!

కొడుకే పుట్టాడు. అనుకున్నట్టుగా తాత పేరే పెట్టారు. అతను కొడుకునెప్పుడూ పేరుపెట్టి పిలవడు. ‘నాన్నా!అనే.  

సుభాషిణి కూడా  ‘నాన్నాఅనే పిలుస్తుందిభర్తని, మావగారిని, బావగారిని పేరుపెట్టి పిలిచే పాపం  గౌరవప్రదమైన ఏ ఆదివాసీ స్త్రీ  కూడా చెయ్యదు

కొన్ని రోజుల తరవాత సుభాషిణి  వాడికి ఓ ముద్దు పేరు పెట్టింది  –  ‘కూనూ‘. అవునుకూనూ’!  ఇంట్లో అందరి కంటే చిన్నవాడు కాబట్టి సరైన పేరే. అంతా ఆనందంగా వున్నారు…  సూనారామ్ , సుభాషిణి, పెద్దక్క పారుల్, బుడ్డి అక్క నిలుమోని

అందరూ ఒకే గూట్లో, కుటుంబం అంతా. , ఆ సంతోషం ఎన్నోరోజులు నిలవలేదు

అది కూనారామ్  దోగాడటం మొదలు పెట్టిన రోజు. సాయంకాలం వర్షం మొదలైందిపనిచేస్కుని ఇంటికి  వస్తున్న  సూనారామ్మీద  పిడుగు పడి చనిపోయాడు. కిందపడున్నసూనారామ్ గుండె మీద ఒక పెద్ద నల్లటి రంధ్రం, దాని చుట్టూ కాలిపోయిన నల్లటి వెంట్రుకలు. శరీరం ఎడమ వైపు అంతా వేడికి నల్లగా కమిలిపోయుంది. నలుపుఆ ఆదివాసీ శరీరపు రంగును మించిన నలుపుశవం రోషపల్ గ్రామం అవతల ఒకపెద్దమహువాచెట్టు కింద పడి వుంది.   ఆ చెట్టు కూడా పూర్తిగా కాలిపోయింది. ఒకప్పుడు పచ్చగా ఆకులతో కొమ్మలతో నిండుగా వున్నచెట్టు,నల్లటి  కాండంతో మాత్రం  మిగిలింది

గ్రామస్తులు  అనుకున్నారు

అంత తొందర దేనికి? మిగతా వాళ్ళలా ఆస్కూలులోకి పరిగెత్తి వుండొచ్చుగా. పాపం ఎంత మంచోడు?  

అది సరేతన మీద పిడుగు పడదు అని ఎలా అనుకున్నాడు” ? 

చూడు తమ్ముడూ, చావు వచ్చేటప్పుడు ఈలలు వేస్తూ, డప్పులు కొట్టుకుంటూ రాదు. ఇంటికి పొయ్యి కొడుకుతో ఆడుకుందాం అని తొందరపడుంటాడు. ఇప్పుడు ఆ కొడుకే కాదు , ఇద్దరు ఆడపిల్లలు కూడా…  వాళ్లంతా ఏమవుతారు? “

ఏమవుతుంది? ఎన్నిరోజులని ఆలోచిస్తూకూర్చుంటారుసుభాషిణి, పారుల్, నిలుమోని బాధ్యతలు తలకెత్తుకున్నారుసుభాషిణి పనికి కుదిరింది. పారుల్, నిలుమోనీ ఆ పసి వాడికి చిట్టి తల్లులుగా మారారు. కూనారామ్  తండ్రి చనిపోయినప్పుడు మరీ చిన్నవాడు కాబట్టి, తండ్రి లోటు తెలియలేదు . కానీ తండ్రి గురించి అమ్మను అడిగేవాడు, నాన్న ఎలా ఉంటాడనీఎలా మాట్లాడేవాడనీ? ఎలా ఆ  వర్షం కురిసిన రోజు తప్పిపోయాడని?

వాడికి నాలుగేళ్లప్పుడు ఓసారి అడిగాడు – 

అసలేం జరిగిందమ్మా నాన్నకి ఆరోజు”? 

ఓహ్ అదా, కనపడకుండా పోయాడు నాన్న” 

ఎలా” ?

విపరీతంగా వాన….. నీళ్లునీళ్లు తీసుకెళ్లాయి నాన్నని”. 

నీళ్ళా “?

అవును నీళ్లు…  నీళ్ళే” !

ఇది విన్నప్పటి నించీనీళ్లు అనే పదం వింటేనే భయపడి పోయేవాడు కూనారామ్వాడికి స్నానం చేయించడం అసాధ్యం అయిపోయింది . రోజులు రోజులు స్నానం మానేసినందువల్ల కాళ్ళు,పిక్కలు మట్టిగొట్టుకుని ఉండేవి. ఇంకా ఇలా కుదరదనిచెప్పి , ఒకరోజు , సుభాషిణి, పారుల్ కల్సి  కూనారామ్ని బావి దగ్గర కెత్తుకెళ్ళి, బట్టలిప్పి, స్నానం చేయించడం మొదలుపెట్టారు. వాడు గిల గిల కొట్టుకున్నా బకెట్లు బకెట్లు చల్లటినీళ్లు ఆపకుండా మీద పోశారు. సుభాషిణి కదలకుండా గట్టిగా పట్టుకుంటే, పారుల్ ముందు ఒక ఎర్ర లైఫ్ బాయ్ ముక్కతో  ఒళ్ళంతా రుద్ది తర్వాత పీచుపెట్టి  తోమేసింది. “వొద్దువొద్దుఅంటూ వాడు పెట్టే కేకల్ని పట్టించుకునే నాధుడే లేకేపోయాడు

అప్పట్నుంచీ కూనారామ్ కి  నీళ్లంటే భయంపోయి, ఊరి చెరువులో కూడా  ఈతకొట్టడం మొదలుపెట్టాడు. చెట్లకొమ్మల మీది నుంచి దూకడం, ఈతతో పాటూ నీళ్ళల్లో  రకరకాలైన విన్యాసాలుచేయడం! ఇదే పని రోజూ

                                                                            ———-

నీళ్ళు .. నీళ్ళతోనే చల్లబరిచింది, నిన్న సాయంకాలం జ్వరంతో కాలిపోతున్న వాడి వొంటిని.  భరించరాని నొప్పి, మంటతో బాధ పడ్తున్నాడు కూనారామ్.  చూడనలివి కాలేదు సుభాషిణికి. 

సుభాషిణి నిన్న ఇంటికొచ్చేటప్పటికే,పారుల్ కాలిపోతున్న వాడి ఒంటినీ, నుదిటినీ,  తడి గుడ్డ పెట్టి తుడుస్తోంది. రాత్రంతా నిద్ర పోలేదు వాడు. వాడు జ్వరంతో పెడ్తున్న మూలుగులకి, సుభాషిణి, పారుల్ , నిలుమోని ఎవరికీ  కంటి మీద కునుకు లేదు. 

ఈరోజు పొద్దున్నే, పక్కింటి ‘పాటా’ కొడుకు “పుచ్చు’ ని, డాక్టర్ని తీసుకురావడానికి పంపితే డాక్టర్ మొలిక్ వచ్చాడు. ఆయన రోజూ జాగారామ్అనే ఊరునించి, రైల్లో పొద్దున్నే  ఛుకులియా వచ్చి, ఒక మందుల దుకాణంలో కూర్చుని రోగులని చూస్తాడు. కూనారామ్ కోసం, ఎవరిదో మోటార్ సైకిల్ తీస్కొని రోషపల్ కి వచ్చాడు. డాక్టర్ మొలిక్కి చాలా మంచి పేరుంది. పల్లె జనాలకు మందులు ఉచితంగా ఇస్తాడు. తన సంచిలో  ఉన్న సాంపిల్స్ లో నుంచి కొన్ని  మందులు తీసి  సుభాషిణికిచ్చాడు.  వచ్చి చూసినందుకు  మాత్రమే డబ్బులు తీసుకున్నాడు డాక్టర్ మొలిక్, ఒక ముప్ఫయి రూపాయలు!. తన చేతి సంచీ లోంచి తీసి నలిగిపోయిన మూడు పది రూపాయ నోట్లు ఇచ్చింది సుభాషిణి. 

పనికి పోయే ముందర కొంతసేపు కూనరామ్ పక్కన కూర్చుంది సుభాషిణి. 

జ్వరం కళ్ళేసుకుని వాళ్ళ అమ్మ వైపు చూస్తూ అడిగాడు వాడు. 

“అమ్మ ఈరోజు శనివారం కదా.  సంత నించి నాకు జిలేబీలు తెచ్చిపెడతావా”? 

మాటల్తో బాటూ వేడి గాలి వాడి  నోట్లో నించి వచ్చి సుభాషిణి వేళ్లను తాకింది..

“తెస్తాను రా. సాయంత్రం వచ్చేటప్పుడు కొనుక్కొస్తాగా”. 

“అమ్మా! ఏదైనా తియ్యగా తినాలనుందే. మర్చిపోకుండా జిలేబీలు తీసుకురావే”. 

“మర్చిపోను లేరా. ఇప్పుడేమీ మాట్లాడకుండా పడుకో. తప్పకుండా తెస్తాలే”. 

                                                            ————–  

మిల్లు చుట్టూ వుండే ప్రహరీ గోడ మీద పెంకుల ముక్కలు పైకి పొడుచుకుని వచ్చినట్టుగా అమర్చి వున్నాయి.  పొద్దున పనికొచ్చినప్పట్నుంచీ, ఆ ప్రహరీ గోడ దాటుకొని,  ఎపుడెపుడు బయట పడదామా అని చూస్తూనే వుంది సుభాషిణి. 

“జిలేబీలు , జిలేబీలు ”  ….  వల్లె వేస్తోంది సుభాషిణి, కూనారామ్ మాటలు మంత్రంలా. 

ఊరికూరికే  చోటా బాబు గదిలోకి వెళ్లి చెమ్మపట్టిన ఆ నీలం రంగు గోడ మీదున్న గడియారంలో పెద్ద చిన్న ముళ్ళు ఎలా ఉన్నాయో గుర్తు పెట్టుకుని, కలూ రానా దగ్గరకు పరిగెడుతోంది. 

రోషపల్ , కమ్మరి బజార్ నించి వచ్చే కలూరానా అదే  రైస్మిల్లు లో  పనిచేస్తాడు.  డిగ్రీ చదూకోలేదు కానీ, నిశానీ అయితే మాత్రం కాదు. చేతిలో వున్న నోటు - రంగు, సైజు చూడకుండా, దాని విలువ చెప్పగలడు. సంతకం చేయడం  గూడా వచ్చు అతనికి.  ఇదిగాక చిన్న చిన్న కూడికలు , తీసివేతలు, భాగహారాలు  తెలుసు. ఇంట్లో కమ్మరి పని చేసుకోడం పాటు , అవీ ఇవీ చిన్న చిన్న పనులు చేసుకు బతుకుతాడు. 

ఈరోజే పదే పదే సుభాషిణి అతనిదగ్గరకెళ్ళి  టైం ఎంత అయిందో వాకబు చేస్తోంది. 

“ చిన్న ముల్లు ఇలా ఉందా?” బియ్యం రాశి మీద వెదురు బద్దతో గీసి చూపిస్తూ అడిగాడు సాలోచనగా. 

తల పైకీ కిందికీ ఊపింది సుభాషిణి.  

 “టైము పదకొండయిందక్కా!”

“ఇంకా పదకొండేనా?” అనుకుంది సుభాషిణి. 

“అక్కా , వింటున్నావా” ? అడిగాడు కలూరాం ఎక్కడో ఆలోచిస్తూన్న  సుభాషిణి ముంజేతిని తడుతూ. 

“ఆ .. ఆ.. వింటున్నా! ఏమన్నావ్” ?  

“ఈ రోజు పన్లోకి ఎందుకు వచ్చావు? ఆ విషయం ముందు చెప్పు!” 

“ఏందీ? పనికా” ?

“వూ దాని గురించే..వాడికి అంత జ్వరం ఉంటే పనికి పరిగెత్తుకొచ్చావు , నీకేమన్నా బుర్రుందా” ?

“ జ్వరమేగా!.. చూద్దాం” 

“ఏవిటి చూసేది?  ఇందాకణ్ణించీ నేచూస్తున్నా, ఇంటికెళ్లడానికి నువ్వు పడే తపన…  విషయం చోటా బాబు కు చెప్పి ఇంటికెళ్లొచ్చుగా” ?

“మంచి సలహానే”. అనుకుంది సుభాషిణి . కానీ అక్కణ్ణుంచీ కదల్లేదు. 

“ జీతం ఏమీ కోసెయ్యడులే. అయినా కోస్తే  ఏమవుతుంది? అక్కడ కూనూ  నీ గురించి ఎంత కలవరిస్తున్నాడో” ?

సుభాషిణి సాయంత్రం నాలుగు గంటల దాకా పనిచేసి,  ఒక్క ఉదుటున మిల్లు నుంచి బయటపడి,  విల్లు నించి విడివడిన బాణంలా ఇంటివైపు నడవడం మొదలుపెట్టింది. 

“దీని  బుర్ర సంత కెళ్ళింది.” అంది డుమిని. “ పొద్దున్న నడుచుకుంటూ వచ్చింది. కూనారామ్ కి బాలేదు అని ఒక మాట చెప్పుండొచ్చుగా. చూడు మొహం ఎలా ఉందొ” 

“ఇంటికి నడిచెళ్ళొద్దు. బస్సులోనో జీపులోనో...

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations