Episode 104
'పీవీ తో నేను' - శ్రీరమణ గారి రచన 'వెంకట సత్య స్టాలిన్' నించి.
తెలుగు వారు గర్వపడే కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు వుంటారు. ఇది గాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ గత యాభై ఏళ్లపైబడి విమర్శ, సమీక్ష , సంపాదకీయం లాంటి అనేక రంగాల్లో పని చేస్తూ ఎంతోమందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు.
అతి సున్నితమైన హాస్యం తో రచనలు చేయడంలో ఆయన సిద్దహస్తులు. తెలుగులో పేరడీ ప్రక్రియకు , ఒక గౌరవ ప్రదమైన సాహితీ స్థాయి కల్పించిన రచయిత గా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఆయన కథా రచన 'మిధునం' మలయాళం లో వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో , తెలుగు లో భరణి గారి దర్శకత్వంలో సినిమా గా తీయడం జరిగింది.
హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ఆయనతో ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది.
ఇంటర్వ్యూ కు , వారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ రమణ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ఇప్పుడు మీరు వినబోతున్న ఆడియో శ్రీ రమణ గారి సరికొత్త హాస్య రచనా సంకలనం 'వెంకట సత్య స్టాలిన్' లోని ఒక భాగం.
ఈ పుస్తకం మీరు డిజిటల్ ఎడిషన్ లేదా ప్రింటెడ్ ఎడిషన్ కొనడానికి , ఇదే వెబ్ పేజీ లో వివరాలు ఇవ్వబడ్డాయి.
ముందుగా వెంకట్ సత్య స్టాలిన్ గురించి , శ్రీరమణ గారి మాటల్లోనే ఓ రెండు ముక్కలు -
" ఇంతవరకు తెలుగు లిటరేచర్‌లో వచ్చిన అత్యుత్తమ హాస్యపాత్ర వెంకట సత్యస్టాలిన్! ఈ ముక్క ఎవరన్నారు?
- అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ వుంటుంది.
ఇంత గొప్ప క్యారెక్టర్‌ని సినిమాలో పెట్టి తీరాల్సిందే!
- నిబిడాశ్చర్యంతో కొందరూ,
- ఆఁ, పెట్టి తీసిందేనని చప్పరిస్తూ యింకొందరూ,
అడయార్ మర్రిచెట్టుకి నాలుగంటే నాలుగే ఆకులు ఉండటం స్టాలిన్‌బాబుకి తెలుసు. కొంచెం ముదురు.
- ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. మీరు తప్పక ఓ కాపీ కొని చదవండి. ఈ బ్రహ్మపదార్థాన్ని మీకు తోచిన విధంగా అంచనా వేసుకోండి. అర్థం చేసుకోండి. అర్థంకాపోతే వెనకనించి ముందుకు చదవండి. తప్పక అవుతాడు. కాపోతే మళ్లీ మొదట్నించి..."
ఇలాంటి వెంకట సత్య స్టాలిన్ గారు మన పూర్వ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి జీవితంలో , ఎలాంటి ముఖ్య పాత్ర వహించారు అనేది, ఆయన స్వగతం లోనే విందాం. స్టాలిన్ గారు తన పేరులోనే సత్యాన్ని ఇముడ్చుకోవడం ద్వారా , తన మాటల్లోనిజం ఎంత ఉందొ మనకు అన్యాపదేశంగా చెబుతున్నారని శ్రోతలందరూ గ్రహించ ప్రార్థన.
పుస్తక ప్రచురణ వివరాలు:
ఈ సంకలనం అనల్ప పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.
https://www.amazon.in/Telugu-Books-ANALPA/s?rh=n%3A8882241031%2Cp_6%3AA32BM6ZYE70A9L
ఈ పుస్తకం digital edition ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.
https://kinige.com/book/Venkata+Satya+Stalin
లేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.
నవోదయ బుక్ హౌస్
3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్
ఫోన్ నెంబర్: 090004 13413
https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7
*Intro- outro BGM credits:
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy