Episode 103

హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ - రెండవ భాగం

హర్షణీయానికి స్వాగతం.

ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ రెండవ భాగం వింటారు.

ఇంటర్వ్యూలో ఆయన తన రచన శైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది.

తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు.

వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి , దేశ విదేశాల్లో పని చేసిన ఆయన 'సోల్ సర్కస్' అనే కథ తో , రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు.

2019 వ సంవత్సరంలో తన మిత్రులతో కలిసి , 'అన్వీక్షికి పబ్లిషర్స్' అనే సంస్థని స్థాపించి, ప్రపంచ సాహిత్యంలోని, తెలుగు సాహిత్యంలోని అనేక చక్కటి పుస్తకాలని తెలుగు పుస్తక ప్రేమికులకు అందచేస్తున్నారు.

ఇదిగాక , ఆయన , తెలుగు సినిమా పరిశ్రమలో డైలాగ్, స్క్రిప్ట్ రైటర్ గా , ఎడిటర్ గా, ప్రొడ్యూసర్ గా , డైరెక్టర్ గా అనేక పాత్రలు నిర్వహిస్తున్నారు.

దృశ్యం, c/o కంచర పాలెం, ఈ నగరానికి ఏమైంది, ఇంకా అనేక చిత్రాలకు ఆయన పని చేయడం జరిగింది.

పుస్తక ప్రచురణ వివరాలు:

'సోల్ సర్కస్' సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.

(https://www.facebook.com/AnvikshikiPublishers/)

ఈ పుస్తకం డిజిటల్ ఎడిషన్ ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

https://kinige.com/book/Soul+Circus

లేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

నవోదయ బుక్ హౌస్

3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

ఫోన్ నెంబర్: 090004 13413

https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations