Episode 128

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో 'హర్షణీయం' ఇంటర్వ్యూ !

తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు. 

ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది. 

రెండు వారాల క్రితం 'హర్షణీయం' ఇనాక్ గారితో ఆయన రచనలు, జీవితాన్ని గురించి సంభాషించే అవకాశం కలిగింది. ఈ ఎపిసోడ్ లో ఆ ఇంటర్వ్యూ మీరు వినవచ్చు.

హర్షణీయం శ్రోతలకై తన సమయాన్ని వెచ్చించిన ఆచార్య ఇనాక్ గారికి కృతజ్ఞతలు.

ఇదే పేజీ చివరన, ఇంతకు మునుపు, హర్షణీయం ద్వారా మీకందజేసిన, ఇనాక్ గారి కథల లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది.  

https://harshaneeyam.in/2020/11/01/sri-enoch/

https://harshaneeyam.in/2020/12/06/enooch-gari-illu/

https://harshaneeyam.in/2020/11/21/enoch-garu/



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations